మన జీవితాలలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి జీవితం లోను చాలానే అనువహవాలు ఉంటాయి. అలాంటి అనుభవాలతో కొన్ని మాత్రమే మనసుకి దెగ్గరగా ఉండే అనుభూతులు కలుగుతాయి. అలాంటి అనుభూతుల లో ఒకటి హెయిర్ డొనేట్ చేయడం. అది కూడా పూర్తిగా గుండు చేపించి మరీ తన జుట్టు ని కాన్సర్ పేషెంట్స్ కోసం దానం చెయ్యడం. మీరు విన్నది నిజమే. అలాంటి ఒక అనుభవమే మన మేఘన జీవితం లో ఉంది. ఆమె అనుభవాన్ని ఆమె మాటలలోనే వింటే అది ఇంకా బావుంటుంది అనే ఉద్దేశం తోనే మేము ఆమెతో మాట్లాడి ఆమె అనుభవాన్ని ఇక్కడ పొందుపరచాము.
నా పేరు మేఘన. మాది విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్. నేను ఆంధ్రా యూనివర్సిటీ లో విద్యార్థినిని. దానితో పాటు "ఆర్ట్ అఫ్ లివింగ్" లో వాలంటీర్ గా కూడా ఉంటూ ఉంటాను. నేను సోషల్ మీడియా లో ఈ హెయిర్ డొనేషన్ గురుంచి చదివి ప్రభావితం అయ్యి నా కేశాలను కూడా డొనేట్ చేద్దాం అని నిశ్చయించుకున్నాను.
తల్లి తండ్రులను ఒప్పించడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. మొదట నేను హెయిర్ కట్ చేపించడానికే ఒప్పించకలిగాను ముందర కాకపోతే నాది అంత పొడవాటి జుట్టు కాదు. మన డొనేట్ చేస్తుందే ఒక చౌసె కోసం అయినప్పుడు ఇచ్చేది ఏదో పూర్తి గా ఇస్తే బావుంటుంది కానీ సగం సగం ఇవ్వడం ఎందుకు అని నా మనసుకి అనిపించింది. అలా అనిపించిన వెంటనే నేను గుండు చేపించి మొత్తం జుట్టు ఇచ్చేద్దాం అని డిసైడ్ ఐపోయాను. అనుకున్నదే తదువుగా నా ఆలోచనని ఆచరణ లో పెట్టేసాను. నా తల్లి తండ్రులు నన్ను చూసి ఆశ్చర్యపోయారు అలా గుండు లో. పార్లర్ కి వెళ్లే ముందరనే మా అమ్మ గారికి నా మనసులోని ఆలోచనని చెప్పాను కానీ ఆమె నాకు అంత ధైర్యం లేదు అని అనింది. ఎప్పుడు అయితే నేను చేపించుకొని ఇంటికి వచ్చానో వాళ్ళు అందరు నన్ను చూసి ఆనందం తో పాటు గా గర్వపడ్డారు.
వైజాగ్ లోని నాచురల్స్ సలోన్ లో చెన్నై హెయిర్ డొనేషన్ వారు చెప్పిన విధము gaa నా కురులను తీపించుకున్నాను. నేను మరియు తమ్ముడు పార్లర్ కి వెళ్లి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చాము. సెలూన్ లో ఇలా నాకు గుండు చెయ్యమని అడిగితే అక్కడ ఉన్న హెయిర్ స్టైలిస్ట్ నా వంక ఆశ్చర్యం గా చూసి నాకు తెలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానా అని చూసారు. ఇప్పటికి గుర్తు ఉంది వాళ్ళ మొహం లోని ఎక్సప్రెషన్స్. తర్వాత వాళ్ళే చాలా సపోర్టివ్ గా ఉన్నారు మరియు ఆ గుండు చేసేప్పుడు మొత్తాన్ని వీడియో తీసి జీవితానికి మర్చిపోలేని ఒక గిఫ్ట్ ని కూడా మిగిల్చారు.
నేను నా చిన్నతనం లో కూడా గుండు చేపించాను కానీ పెరిగిన తర్వాత మాత్రం ఇదే మొదటి సారి. మదిలో ఎన్నో ఆలోచనలు కాలేజీ లో నా తోటి వాళ్ళు ఎలా తీసుకుంటారు అని.
నేను అసలు మేనేజ్ చెయ్యగలనా లేదా?
నేను గుండు లో ఎలా ఉంటానో?
ఇలాంటి ఎన్నో ఆలోచనలు నా మదిలో మెదిలాడుతూనే ఉన్నాయి. వాటిని పటాపంచెలు చేసింది ట్రిమ్మర్. అది నా తలకి తాకి నా తల నుండి కొన్ని వెంట్రుకలని వేరుచేసాక నా ఆలోచనలన్నీ తొలిగిపోయాయి. ఎప్పుడు అయితే నా తల భాగం నుండి జుట్టు వేరు అవ్వడం మొదలు అయ్యిందో ఆ క్షణం నుండి నా మీద నాకు నమ్మకం పెరిగింది ఇది నేను చెయ్యగలను అని. డొనేషన్ చేసే టైం లో నా జుట్టు పొడవు ఎంత అనేది నాకు కరెక్ట్ గా తెలియదు కాకపోతే అది మాత్రం 12 అంగుళాల కంటే పాడవే ఉంది మరియు డొనేషన్ కి సరిపోతుంది అని మాత్రం తెలియ చేసారు. గుండు చేసే సమయం లో వివిధ ఎమోషన్స్ అనేవి నా మనసులో నడుస్తూ ఉన్నాయి. పూర్తి గా అయ్యాక నేను ఎలా ఉంటాను అనేది ఎక్కువ గా ఉంది. చెప్పడానికి చిన్నదే అయినా కానీ ఇది నా జీవితం లో చాలా పెద్ద మార్పు. అందుకే భయం మరియు అన్ని రకాల ఎమోషన్స్ కానీ ఇవి అన్ని నన్ను ఇంకా గట్టిగ ఉండేలాగా చేశాయి.
మంగలి కత్తితో చేసేప్పుడు నాకు ఒక చిన్న భయం మదిలో మెదలాడుతూ ఉంది. ఒక వేళ తెగి గాటు లాగా పడుతుందేమో, రక్తం కారుతుందేమో అని చాలా భయపడ్డాను. కానీ అలాంటిది ఏమి జరగకుండా చాలా మంచిగా చేసారు సలోన్ వాళ్ళు. ఒక్క దానినే వెళ్లిన నా ఫ్రెండ్ నాకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే బహుశా ఈ సాహసం నేను చేసేదానిని కాదేమో. నా మనసులో ఉన్న టెన్షన్ పోవడానికి నా ఫ్రెండ్ సపోర్ట్ చాలానే ఉంది. నన్ను చూసి గర్వపడుతున్నాను అనే పదం నన్ను బూస్ట్ అప్ చేయడానికి చాలా దోహద పడింది.
నేను ఇలా గుండు చేపించుకొని జుట్టు ని డొనేట్ చేస్తున్నాను అనే సంగతి ఎవరికీ తెలీదు మరియు చెప్పలేదు కూడా. ఎప్పుడు అయితే నేను గుండు ఫోటో పంపించానో (అది కూడా చాలా దెగ్గర వాళ్లకి మాత్రమే) అందరు కొంచెం షాక్ అయ్యారు అనుకోండి. తెలియని వాళ్ళు ఆశ్చర్యం లో మునిగిపోయారు నన్ను ఈ కొత్త లుక్ లో చూసాక. ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది నన్ను ఇంకా స్ట్రాంగ్ గా చేసింది మరియు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
"ఎవరికి అయినా గుండు చేపించుకోవాలనే ఆలోచన ఉంది కాకపోతే ధైర్యం సరిపోకపోతే మాత్రం, ధైర్యం గా ఆ ఒక్క స్టెప్ ముందరకి వేయండి ఎందుకు అంటే ఆ ఒక్క అడుగు మీ జీవితం లో మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా తయారు చేసే విషయం లో ఉపయోగ పడుతుంది..."
మీకు కూడా ఇలాంటి అనుభవాలు లేక అనుభూతులు ఏమైనా ఉంటె మాతో పంచుకోవాలనుకుంటే మమ్మల్ని ఈ మెయిల్ లో సంప్రదించగలరని ప్రార్ధన.